సౌదీ అరేబియాతో పాటు ఏడు దేశాలు ఖతార్ దేశంలో సంబంధాలను తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో.. భారత్‌తో పాటు 80 దేశాలు ఖతార్‌కు వీసా లేకుండా రావొచ్చునని.. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోం శాఖ ప్రకటించింది. ఈ విధానం ప్రకారం, భారత్, అమెరికా, ఇంగ్లండ్, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి 80 దేశాలు వీసా లేకుండా ఖతార్‌కు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ హోం శాఖాధికారులు వెల్లడించారు.