ఆ దాడులు చేసిన ఆత్మాహుతి బాంబర్లలో ఒక మాజీ ఎంపీ కూడా ఉన్నట్లు తేలింది. 2004 నుంచి 2010 వరకు సోమాలియా పార్లమెంటులో సభ్యుడిగా పనిచేసిన సలా బాడ్బాడో (53) ఆ తర్వాత వెంటనే అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థలో చేరారు. సోమాలియాలోని అల్ ఖైదా అనుంధ సంస్థలో చేరేందుకు తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు ఆయన అప్పట్లో ఆయన ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు.
మంగళవారం నాటి ఇద్దరు బాంబర్లలో ఆయనొకరని అల్ షబాబ్ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ ఇద్దరు యోధుల్లో సలా బడ్బాడో ఒకరని, హలేన్ మిలటరీ బేస్ మీద జరిగిన దాడుల్లో ఆయన కూడా పాల్గొన్నారని టెలిగ్రామ్ యాప్ ద్వారాను, అండాలస్ రేడియో స్టేషన్ ద్వారాన విడుదల చేసిన ప్రకటనల్లో వెల్లడించారు.