తాము ప్రత్యక్షంగా యుద్దంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, కమలా హారిస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా వచ్చే వారంలో కమలా హారిస్ ఆ దేశాల్లో పర్యటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా కమలా హారిస్ మార్చి 9-11 మధ్య పోలండ్‌లో రాజధాని వార్సా, రొమేనియాలోని బుకారెస్ట్ టూరుకు వెళ్తారు. ఈ క్రమంలో ఆ రెండు దేశాల నేతలతో సమావేశమై.. ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు.