ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్... రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపును నమోదు చేసుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మరోమారు ఢిల్లీ కేపిటల్స్ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 148 పరుగులకే చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అద్భుతమైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతిలో హాఫ్ సెంచరీ చేసిన ధావన్‌కు ఇది ఐపీఎల్‌లో 39వ హాఫ్ సెంచరీ. దీనికంటే ముందు ధావన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మలతో 38 అర్థశతకాలు చేసిన భారత ఆటగాడిగా వారితో సమానంగా ఉన్నాడు.
అలాగే ఐపీఎల్ 2020లో దక్షిణాఫ్రికా పేసర్ నోర్జే అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన తన సహచరుడు డెల్ స్టెయిన్ ఫాస్టెస్ట్ రికార్డును అధిగమించడంతో మరో రెండు ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నోర్జే.
అంతేగాకుండా ఐపీఎల్‌లో రెండో, మూడో వేగవంతమైన బంతులు బౌలింగ్ చేసిన బౌలర్‌గానూ ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 155.2 కి.మీ/గంటకు, 154.7 కి.మీ/గంటకు వేగంగా బంతులను సంధించి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన బంతులు సంధించి, ఒకే మ్యాచ్‌లో బౌర్ నోర్జే ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నోర్జే 4-0-33-2 గణాంకాలతో రాణించాడు.