క్రికెట్‌ను వదిలిపెట్టని కరోనా.. బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యునికి కోవిడ్

గురువారం, 3 సెప్టెంబరు 2020 (16:35 IST)
కరోనా వైరస్ క్రికెట్‌ను వదిలిపెట్టట్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ దుబాయ్‌కి మారినప్పటికీ బీసీసీఐని వదలట్లేదు. తొలుత... చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును భయాందోళనలకు గురి చేసిన వైరస్‌... తాజాగా బీసీసీఐని పలకరించింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌లోని ఓ సభ్యునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సభ్యునికి కరోనా సోకిన మాట నిజమే అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేదని బోర్డు చెబుతోంది.
 
ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడని, ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేడని స్పష్టం చేసింది. ఎమిరేట్స్‌కు వెళ్లే సమయంలో కూడా ఆ సభ్యుడు ఇతరత్రా ఏ క్రికెటర్‌తోనూ కాంటాక్ట్‌ కాలేదని బోర్డు వెల్లడించింది.
 
ఐపీఎల్‌ కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లిన తర్వాత మొత్తం పదమూడు మంది చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యులకు కరోనా సోకింది. అయితే రెండు రోజుల కిందట వారందరికీ మరోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో... నెగటివ్‌ రిపోర్ట్ వచ్చింది.
 
దీంతో... సీఎస్‌కే జట్టు కుదుటపడింది. కాగా... తాజాగా బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సభ్యుడికే కరోనా వచ్చింది. మరోవైపు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న ఇద్దరు సభ్యులకు కూడా కరోనా సోకింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు