కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సీఎస్కే 15 పరుగుల తేడాతో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని సీఎస్కే విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది.