ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు.. ఐపీఎల్ 2024 చివరిదా? లేకుంటే ఏంటి సంగతి?

సెల్వి

గురువారం, 16 మే 2024 (23:09 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు మ్యాచ్ శనివారం జరుగనుంది. ఈ రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఈ రెండు జట్లకూ ఇదే చివరి మ్యాచ్. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ గురించి ఈ మ్యాచ్ సందర్భంగా టాక్ మొదలైంది. 
 
సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ దీనిపై మాట్లాడుతూ.. ధోనీ ఇప్పటికీ తన ఛరిష్మాను కోల్పోలేదని, గత ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్నప్పటికీ.. ఈ సీజన్‌ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతున్నాడని ప్రశంసించాడు.
 
ధోనీ మరో రెండు ఐపీఎల్ సీజన్లు ఆడొచ్చని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పాడు మైక్ హస్సీ. కేప్టెన్సీ మార్పు వ్యవహారం తనకూ ఆశ్చర్యపరిచిందని మైక్ హస్సీ వ్యాఖ్యానించాడు. 
 
సీఎస్‌కే కేప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అపాయంట్ అవుతున్నట్లు చివరి వరకూ తనకు తెలియదని చెప్పాడు. డెత్ ఓవర్లల్లోనే వస్తాడని, ధోనీలాగా చివరి ఓవర్లల్లో క్లీన్‌ హిట్ ఎవరూ చేయలేరని అన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు