IPL Auction 2022 శనివారం ఐపీఎల్ వేలం: 64 మంది అమ్ముడుపోయారు

శనివారం, 12 ఫిబ్రవరి 2022 (23:43 IST)
తొలిరోజు మెగా వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ భారీగానే వెచ్చించింది. షారూఖ్ ఖాన్ టీమ్ శ్రేయాస్ అయ్యర్‌ను భారీ ధరతో కొనుగోలు చేసింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను కూడా తిరిగి జట్టులోకి తీసుకున్నారు. శనివారం జరిగిన వేలంలో మొత్తం 64 మంది క్రికెటర్లు అమ్ముడుపోయారు.

 
KKR మొత్తం ఐదుగురు క్రికెటర్లను కైవసం చేసుకుంది. శ్రేయాస్‌ను అత్యధిక ధరతో జట్టులోకి తీసుకున్నారు. 12 కోట్ల 25 లక్షల రూపాయలకు అతడిని జట్టు కొనుగోలు చేసింది. అతను ఇయాన్ మోర్గాన్ తదుపరి కెప్టెన్ అని భావిస్తున్నారు. KKR నితీష్ రానాను 7 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

 
పాట్ కమిన్స్‌ను 8 కోట్ల 25 లక్షల రూపాయలతో దక్కించుకున్నారు. అతను కెప్టెన్ కాకపోయినా, అతనిని కో-కెప్టెన్‌గా నియమించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి ఆల్‌రౌండర్‌ షారుక్‌ ఖాన్‌, కేకేఆర్‌ దూసుకెళ్లింది. అయితే చివరికి ప్రీతీ జింటా ఫ్రాంచైజీ పంతం పట్టి భారీగానే లాగేసింది.
 
మొదటి రోజు వేలం ముగిసే సమయానికి ఇలా వున్నాయి లెక్కలు.
పంజాబ్ కింగ్స్ - 26.75 కోట్లు
ముంబై ఇండియన్స్ - 26.75 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ - 20.45 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ - 20.15 కోట్లు
గుజరాత్ టైటాన్స్ - 16.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 16.50 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ - 12.15 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 9.25 కోట్లు
లక్నో సూపర్ జెయింట్ - 8.90 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ - 12.75 కోట్లు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు