ఫేస్‌బుక్‌లో నియామకాలు నిలివేత - 15 శాతం ఉద్యోగులపై వేటు?

శుక్రవారం, 7 అక్టోబరు 2022 (11:14 IST)
ప్రముఖ సంస్థ ఫేస్‌బుక్‌లో కొత్తగా నియామకాలను నిలిపివేశారు. అదేసమయంలో ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న వారిలో 15 శాతం మంది ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో లే ఆఫ్స్‌కు అనుగుణంగా అడుగులు పడతాయని తెలుస్తోంది. 
 
ఇటీవల జరిగిన మెటా ఎర్నింగ్స్‌ కాల్‌లో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ, తాజా నియామకాలను నిలిపివేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో లే ఆఫ్స్‌కు అనుగుణంగా అడుగులు పడతాయని సంకేతాలు పంపిచారు.
 
దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో పలు విభాగాల నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

మొత్తంగా చూస్తే 15 శాతం మంది ఉద్యోగులపై వేటు పడొచ్చని తెలుస్తోంది. దీంతో అనేక మంది ఫేస్‌బుక్ ఉద్యోగులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు