ఈ అత్యంత ప్రమాదకరమైన జోకర్ మాల్ వేర్‌ను గత సంవత్సరం చివర్లో గుర్తించామని, ఇది ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఇది యాప్స్‌లో దాగుండి, స్మార్ట్ ఫోన్లలోకి ఇతర వైరస్‌లను ఎవరి ప్రమేయం లేకుండానే డౌన్‌లోడ్ చేస్తోందని, దీని కారణంగా ఎన్నో ప్రీమియం యాప్స్ ప్రమాదంలో పడ్డాయని గూగుల్ తెలిపింది.
మొత్తం 11 యాప్‌లను తాము డిలీట్ చేశామని చెబుతూ, వాటిల్లో ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, యాండ్రాయిడ్ ఎస్ఎంఎస్, చెర్రీ, సెండ్ ఎస్ఎంఎస్, లవింగ్ లవ్ మెసేజ్, విత్ మీ, హెచ్ఎం వాయిస్, ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమొరీ గేమ్ ట్రయినింగ్ తదితరాలు ఉన్నాయని వెల్లడించింది.
కాగా, తనను గుర్తించకుండా ఉండేందుకు ఈ వైరస్ పాత టెక్నిక్‌లను వినియోగిస్తోందని, రెండు మార్గాల ద్వారా స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోందని రీసెర్చర్లు వెల్లడించారు. ప్లే స్టోర్ సెక్యూరిటీని దాటి మరీ ఇది యాప్స్‌కు పట్టుకుందన్నారు.
ఈ వైరస్‌ను తయారు చేసిన వారు దాని కోడ్‌ను తగ్గించారని, అది కూడా 'డెక్స్' ఫైల్ రూపంలో ఉండి, గుర్తించేందుకు క్లిష్టతరంగా మారిందని వివరించింది. అందువల్ల ఎవరిఫోన్లలోనైనా ఆ 11 యాప్స్ ఉంటే తక్షణం డిలీట్ చేయాలని కోరింది.