గూగుల్ ప్లే స్టోర్‌లో వందలాది అప్లికేషన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 800లకు పైగా అప్లికేషన్లలో జేవియర్ అనే మాల్‌వేర్ ఉంది. యూజర్ సమాచారాన్ని నిశ్శబ్దంగా తస్కరించే ఈ మాల్‌వేర్ ఫొటో మానిప్యులేటర్, వాల్‌పేపర్, రింగ్‌టోన్లు వంటి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయడం వల్ల ప్రవేశిస్తుందని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ట్రెండ్ మైక్రో వెల్లడించింది.