మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని రకాల ఫోన్లు పనిచేయవట. ముఖ్యంగా, డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సప్ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదట. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది.
బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది.
ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్(ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.