అగ్రరాజ్యం అమెరికా సహా నాటో, ఈయూ దేశాలు సహా పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి యూట్యూబ్, గూగుల్ ప్లేలు కూడా చేరిపోయాయి.
వాస్తవానికి ఇదివరకే యూట్యూబ్‌తో పాటు గూగుల్ కూడా రష్యా వాణిజ్య ప్రకటనలను తమ వేదికపై నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా చెల్లింపులతో కూడిన తన సేవలన్నింటినీ కూడా రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా యూట్యూబ్, గూగుల్ ప్లే తెలిపాయి.
ఈ నిర్ణయంతో రష్యాకు చెందిన వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియమ్, ఛానెల్ మెంబర్ షిప్, సూపర్ ఛాట్, మర్కెండైజ్ సేవలు అందవు.