అల్పుడెప్పుడు పలుకు

బుధవారం, 23 జులై 2008 (11:39 IST)
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!

భావము :
అల్పుడెప్పుడు మాట్లాడినా ఆడంబరంగానే ఉంటుంది. అదే సజ్జనుడు మాట్లాడితే చల్లగా, నిరాడంబరముగా ఉంటుంది. కంగున మోగి విలువలేని ఇత్తడిలాగా అనవసరమైన హడావిడి చేసేవారు అల్పులు. శబ్దం రాకపోయినా బంగారం లాగా విలువైన వాడు సజ్జనుడు.

వెబ్దునియా పై చదవండి