ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, మోడీ వంటి భయస్థుడు, బలహీనమైన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ మరిచారని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు.
తమ పార్టీ లేదా తమ పార్టీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రాగానే పేదల కోసం తీసుకొచ్చిన న్యాయ్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. అలాగే, తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు.