ప్రపంచస్థాయి మహిళానేత మాయావతి

సోమవారం, 15 అక్టోబరు 2007 (15:59 IST)
అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక తన తాజా సంచికలో ప్రకటించింది.

దళితురాలైన మాయావతి తన జీవనయాత్రలో అడుగడుగునా అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎదుర్కుంటూ, ఏటికి ఎదురీదిన చందంగా ఎదిగిన వైనాన్ని న్యూస్‌వీక్ సమగ్రంగా వెల్లడించింది. దళితులు, అగ్రవర్ణాలు మరియు ముస్లీం అభ్యర్థులతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి అయిన 51 సంవత్సరాల మాయావతి, ఘనవిజయాన్ని స్వంతం చేసుకున్నారు.

న్యూఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లో ప్రయోగించిన సర్వమతాల సంకీర్ణ ధర్మాన్నే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మాయావతి భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారని న్యూస్ వీక్ తన కథనంలో పేర్కొంది.

ఈ సందర్భంగా మాయావతి విజయగాథతోపాటు ఫ్రెంచ్ ఎనర్జీ కాంగ్లోమెరేట్ అరెవా అన్నే లోవెర్గోన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ
మార్గరేట్ ఛాన్ విజయగాథలు కూడా న్యూస్ వీక్‌లో ప్రచురితమయ్యాయి.

వెబ్దునియా పై చదవండి