పైగా, నాయకుడు లేకపోవడంతో ప్రస్తుతం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పార్టీ మల్లగుల్లాడు పడుతోంది. అయితే పార్టీ రూల్స్ ప్రకారం రాహుల్ స్థానంలో కొత్త చీఫ్‌ను ఎన్నుకునే అధికారం సీడబ్ల్యూసీకి ఉంది. అయినప్పటికీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.
గత 50 రోజుల్లో రెండుసార్లు వార్‌రూమ్ మీటింగ్స్ పెట్టినా, వాటిలో కర్నాటక రాజకీయాల ప్రస్తావనే తప్ప వారసుడి ఎంపికపై చర్చ జరగలేదు. కర్నాటక క్రైసిస్ వల్ల వారసుడి ఎంపిక ఆలస్యం అవుతోందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి రాహుల్ రాజీనామా తర్వాత చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.