పాకిస్థాన్‌కు చెందిన ఆల్ ఖైదా ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా భారత్‌లోని వారిని ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దాడులకు పాల్పడే విధంగా రెచ్చగొట్టినట్లు దర్యాప్తు ద్వారా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్‌ఖైదా భారీ కుట్రను చేధించింది ఎన్‌ఐఏ... కేరళ, పశ్చిమ బెంగాల్‌లో అనుమానితులపై దాడులు జరిపింది.
కేరళలోని 11 ప్రాంతాల్లో, బెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో 9 మందిని అదుపులోకి తీసుకుంది. ఎర్నాకులం, ముర్షీదాబాద్ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఈ దాడులు జరిపింది. తొమ్మిది మంది యువకులు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్సీదాబాద్‌తో పాటు కేరళలోని ఎర్నాకుళంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగాల్ నుండి అరెస్టయిన మరో ఆరుగురు నజ్ముస్ సాకిబ్, అబూ సుఫియాన్, మెనుల్ మొండల్, ల్యూ యేన్ అహ్మద్, అల్ మామున్ కమల్ మరియు అతితుర్ రెహ్మాన్, పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ నివాసితులు.