దుబాయ్ వెళ్లాక అతడిలోని సైకో బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా బాధితురాలిని వేధింపులకు గురిచేసేవాడు. అతంటితో ఊరుకోక భార్య చేత బలవంతంగా బీర్ తాగించేందుకు ప్రయత్నించేవాడు. ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్ తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం చేస్తానని తేల్చి చెప్పేశాడు.
ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్ చెక్కేశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.