భారత ఆర్మీ తొలి చీఫ్, ఫీల్డ్ మార్షల్ కరియప్ప పేరును భారత్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు సిఫారసు చేశారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతరత్నకు కరియప్ప అన్ని విధాలా అర్హులని అన్నారు.
కాగా, 1949లో ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్‌గా కరియప్ప నియమితులయ్యారు. 5 స్టార్ ర్యాంకింగ్ సాధించిన ఇద్దరు భారత సైనికాధికారుల్లో కరియప్ప ఒకరు. 1947 ఇండో-పాక్ యుధ్దం, 1965 ఇండో-పాక్ యుద్ధంలో కరియప్ప పాల్గొన్నారు. 1993, మే 15వ తేదీన కన్నుమూశారు.