సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి పర్యాటక క్షేత్రం తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ఆజంఖాన్ తెలిపారు. ఒకప్పుడు తాజ్ మహల్ శివాలయమని ఆదిత్యనాథ్ ముందునుంచే చెప్తున్న నేపథ్యంలో..తాజ్‌ను కూలగొట్టేందుకు బీజేపీ కదిలితే.. తానూ కలిసొస్తానని అన్నారు.