బెంగుళూరు మహాలక్ష్మీలేఔట్‌కు చెందిన ఓ యువతికి ముగ్గురు యువకులు ఆరు నెలల క్రితం పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమెకు బైక్ కొనిస్తాని ఆశచూపించారు. అలా.. వారి మాటలు నమ్మి వెంట వెళ్లింది. ఆమెను మండ్య, తుమకూరు ప్రాంతాల్లో ఆమెను తిప్పుకొని చివరికి అదునుచూసి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడింది మహాలక్ష్మీ లేఔట్‌కు చెందిన భరత్, ప్రమోద్, హరీష్‌లుగా గుర్తించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలిని విచారిస్తే.. పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తేలింది. శుక్రవారం ఆమెను వైద్య పరీక్షల కోసం వైద్యాలయంలో చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.