కరోనా కారణంగా బీజేపీ ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నంద్‌కుమార్ మధ్యప్రదేశ్ ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్ నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. గత జనవరి 11న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు.
చౌహాన్ గత కొద్దిరోజులుగా ఆయన వెంటిలెటర్‌పైనే ఉన్నారు. ఆయన గతంలో పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం నిమార్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని షాపూర్. 8 సెప్టెంబర్, 1952లో జన్మించారు.
1996లో షాపూర్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నంద్‌కుమార్ మృతిపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, అంకితభావం గల నాయకుడిని కోల్పోయిందన్నారు.