అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. జన సమూహాలకు దూరంగా ఉండాలని, పండుగలను వర్చువల్గా జరుపుకోవాలని కోరారు. సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదని, కరోనా వైరస్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ దేశంలో రోజుకు దాదాపు 20వేల కేసులు వస్తున్నాయని గుర్తు చేశారు.
జన సమూహాలకు, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వేడుకలను వర్చువల్గా జరుపుకోవడం, ఇంట్లోనే ఉండటం, ఆన్లైన్ షాపింగ్లకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు కొనసాగించాలి'' అని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విజ్ఞప్తిచేశారు.
తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగా ఉంది. అలాగే, 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 28 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5నుంచి 10శాతంగా ఉంది.