ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. కాగా, వారిని ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారని వెల్లడించారు.
కొన్నిసార్లు సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని చెప్పారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్ రీజియన్‌లోని గిరిజన సంఘాలు మావోయిస్టులను కోరాయన్నారు. గత జూలైలో కుందేడ్‌కు చెందిన ఎనిమిది మందిని ఎత్తుకెళ్లారని, రెండు మూడు రోజుల తర్వాత వారిని విడుదల చేశారని శర్మ గుర్తు చేశారు.