భారతీయులంటే బీజేపీ, ఆరెస్సెస్ సభ్యులు మాత్రమేనా?: చిదంబరం

శనివారం, 8 ఏప్రియల్ 2017 (13:30 IST)
దక్షిణాది ప్రజలు నల్లగా ఉంటారని, తాము నల్లగా ఉన్నవారితోనూ కలిసి వుంటున్నామని నల్లని దేవుడైన శ్రీ కృష్ణుడిని కూడా కొలుస్తామని, అలాంటప్పుడే దేశంలో విచక్ష ఎక్కడిదని బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్లపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. విజయ్ మాటల్లో మేము అంటే ఎవరని సూటిగా ప్రశ్నించారు. 
 
"మేము నల్లవారితో కలిసి వుంటున్నాం అన్నారు. ఇందులో మేము అంటే ఎవరని ప్రశ్నించారు. మేము అనే పదానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులేనా? అంటూ అడిగారు. కేవలం బీజేపీ, ఆరెస్సెస్ సభ్యులు మాత్రమే భారతీయులని భావిస్తున్నారా అంటూ ట్విట్టర్ వేదికగా పీసీ నిలదీశారు.
 
అయితే దక్షిణాది ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు గాను విజయ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలిపారు. దక్షిణ భారతీయుల పట్ల వివక్ష చూపేలా ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. భారత్‌లో ఆఫ్రికన్లపై జరిగిన విద్వేషపూరిత దాడులకు సంబంధించి విజయ్‌ అల్‌ జజీరా టీవీ చర్చలో పాల్గొంటూ.. తాము దక్షిణ భారతీయులతో కలిసి ఉండడం లేదా అని దక్షిణాదివారిపై చులకనభావంతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దుమారం సృష్టించడంతచో ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి