బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోంది. అల్పపీడనం తుపానుగా మారాక గంటకు 102 కిలో మీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల వారు చేపల వేట, ఇతర ఏ పనులపైనా సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది.
ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.