పురుషులు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ప్రతి ఒక్కరి జీవన విధానంలో వచ్చినమార్పులేనని చెబుతున్నారు. కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలతో అనారోగ్య సమస్యలకు దారితీయడం ఒక కారణమైతే.. మరొక కారణం.. ప్లాస్టిక్ వినియోగం.
ఈరోజుల్లో ప్లాస్టిక్ వినియోగం సర్వసాధారణం. అయితే ఈ ప్లాస్టిక్, కాస్మొటిక్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి ఉత్పత్తుల్లో లభించే థాలెట్స్ అనే సాధారణ కెమికల్స్.. ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రీప్రొడెక్టివ్ ఎపిడెమియాలజిస్ట్ సినాయి స్వాన్ ప్రకారం... ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందని, సంతానపరంగా తీవ్రమైన సమస్యలు ఎదుక్కోబోతున్నారంటూ హెచ్చరిస్తున్నారు.