హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు సమీపంలోని ధామి పట్టణంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన సిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో జిరగింది. భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడిన సమయంలో కొండ రాళ్ళ భవనాన్ని బలంగా ఢీకొట్టాయి. దీంతో భవన్ పునాదులు కదిలిపోవడం వల్ల ఈ భవనం కుప్పకూలిపోయివుంటుందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఈ భవనంలోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం లేకుండా పోయింది.
ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించి ఐదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించారు.