ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పెళ్లికి ముందు వధూవరులిద్దరికి హెచ్ఐవీ పరీక్షలు చేయించుకునే పద్ధతి అమలును పరిశీలించాలని తాను న్యాయశాఖను కోరామని ఆరోగ్య మంత్రిగా ఉన్న విశ్వజిత్ తెలిపారు. పెళ్లికి ముందు హెచ్ఐవీ పరీక్షలు జరిపించుకునేలా ప్రజాఆరోగ్య చట్టంలో ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణలు తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
గోవాలో 1987 నుంచి ఇప్పటివరకు 17,122 మంది రోగులకు హెచ్ఐవీ సోకిందని తేలినందున ఈ నిర్ణయం తీసుకోనున్నామని మంత్రి వివరించారు. దీంతోపాటు తలసీమియాతో బాధపడే పిల్లలు పుట్టకుండా ఉండాలంటే పెళ్లికి ముందు తలసీమియా పరీక్ష కూడా చేయించుకోవాలని మంత్రి సూచించారు.