మహేష్‌ను ఎవరు చంపారో పార్టీకి వచ్చిన వారు ఎవరూ చెప్పలేకపోయారు. కానీ పోలీసులు మాత్రం కేసును సవాల్‌గా తీసుకున్నారు. ముందుగా భార్యను అదుపులోకి తీసుకుంటే పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమె కూడా భాగస్వామ్యురాలని నిర్థారించుకున్నారు. పోలీసుల తమదైన శైలిలో విచారణ చేసారు. దీంతో నిజాలన్నీ ఒప్పుకుంది. సచిన్ యాదవ్ అనే వ్యక్తితో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పింది. అయితే ఇంట్లో వంట చేయలేదని.. ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేదని తన భర్త తరచూ కొట్టేవాడని చెప్పింది.
గత వారంరోజుల క్రితం తన ప్రియుడు తన ఇంటివైపుగా వెళుతూ తన భర్త తనను కొట్టడాన్ని చూశాడని.. అది తట్టుకోలేకపోయాడని చెప్పుకొచ్చింది. నీ భర్తను నీ పుట్టినరోజు చంపేస్తానని తనకు చెప్పాడని.. చెప్పిన మాట ప్రకారమే చంపేశాడని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. దీంతో నిందితుడిని, సహకరించిన భార్యను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.