గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్‌జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనులో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11వ తేదీన తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఘటనపై రణ్‌జీత్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. 'ఐఏఎస్ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రణ్‌జీత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెనులోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది' అని తెలిపారు. అలాగే, భార్య మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఐఏఎస్ అధికారి నిరాకరించారు.