ఆర్కేనగర్ ఎన్నికలు... దీప ఆస్తులు రూ.3.05కోట్లు.. కనిమొళికి కరుణ చెక్..

శనివారం, 25 మార్చి 2017 (15:00 IST)
ఆర్కేనగర్ ఉప ఎన్నికలపైనే తమిళ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. డీఎంకే- అన్నాడీఎంకేల మధ్య జరిగే రసవత్తర పోటీ.. ఈసారి రూటు మార్చుకుంది. అన్నాడీఎంకేలో అమ్మ మరణం తర్వాత ఏర్పడిన చీలికలతో ఆర్కేనగర్‌లో.. మధుసూదన్, దినకరన్, దీప వేర్వేరుగా పోటీ చేస్తున్నారు.

ఇక బీజేపీ తరపున ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదోనని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్కే నగర్ ప్రజలు.. ఓపీఎస్ వర్గానికి ఓటేస్తారా? దినకరన్-దీపల్లో ఎవరిని గెలిపిస్తారు అనే దానిపై ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సి వుంది. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న దివంగత ముఖ్యమంత్రి జయలలిత సొంత నియోజకవర్గమైన తమిళనాడులో ఆర్కే నగర్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు.

ఈ క్రమంలో తన ఆస్తుల విలువ 3.05 కోట్ల రూపాయలని తెలిపారు. ఇందులో రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, 1.05 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు.
 
ఇదిలా ఉంటే.. డీఎంకే పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం.కరుణానిధి కుమార్తె, ఎంపీ కళిమొని ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి