కేరళలో ఇవాళ కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా అనుమానిత కేసులు 286 నమోదవగా..వీటిలో 256 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేరళ సీఎం పినరయ్ విజయన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక కోవిడ్-19 కారణంగా విషమ పరిస్థితుల్లో వున్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా మళ్ళీ ఆరోగ్యవంతులను చేసేందుకు కేరళ ప్రభుత్వం నడుం కట్టింది.