979కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. 24 గంటల్లోనే..?

సోమవారం, 30 మార్చి 2020 (13:01 IST)
క్ష‌ణం క్ష‌ణం విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లోనే భారీ సంఖ్యలో నమోదైనాయి. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో ఉన్న క‌రోనా కేసుల సంఖ్య 979కు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లోనే క‌రోనా మ‌న దేశంలో రెచ్చిపోయింది. 
 
24 గంట‌ల్లో 106 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 196 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేర‌ళ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు అదుపు త‌ప్పేలా ఉన్నాయి.
 
 ఇక రాజ‌స్థాన్లో 55 కేసులు, తెలంగాణ‌లో 67 కేసులు ఉంటే ఏపీలో 19 కేసులు న‌మోదు అయ్యాయి. ఇదివరకు క‌రోనాతో 25మంది మృతి చెందారు. ఇక పంజాబ్‌లో బ్యాంకులు వారానికి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు