లోక్‌సభ ఎన్నికలు 2024కు నగారా మోగింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్"ను ఎన్నికల సంఘం అమలు చేస్తుంది.
ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కోడ్ అమల్లోనే ఉంటుంది. నిష్పక్షపాతంగా, సవ్యంగా ఎన్నికలను నిర్వహించాలంటే ఎన్నికల కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుందని, ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుందని, మే 7న పోలింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
మూడో విడతలో 12 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. 17వ లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుండగా.... అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనున్నాయి.