రమ్మీ పేకాటను ప్రోత్సహిస్తున్న కోహ్లీ - తమన్నా- రానా??

మంగళవారం, 3 నవంబరు 2020 (17:24 IST)
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువైంది. అంటే ఆన్‌లైన్ జూదం. ముఖ్యంగా ఆన్‌లైన్ రమ్మీకి ఎంతో మంది బానిసలుగా మారిపోతున్నారు. ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇలాంటి గ్యాంబ్లింగ్‌కు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ హీరోయిన్ తమన్నా, హీరో దగ్గుబాటి రానా, నటులు ప్రకాష్ రాజ్, సుదీప్‌ తదితరులు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో దీన్ని నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. ఆన్‌లైన్ జూదానికి సంబంధించిన డబ్బు ఎక్కడకు పోతుందని ప్రశ్నించింది. తెలంగాణలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన మద్రాస్ హైకోర్టు బెంచ్... తమిళనాడులో అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అని అడిగింది. 
 
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిషేధంపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. అదేసమయంలో దీనికి ప్రచారకర్తలుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్‌లకు నోటీసులు ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు