కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో నిందితుడు సీసీటీవీలో కనిపించాడు. అతడి వెనుక ఆ బాలిక వెళ్తున్నట్లు అందులో ఉన్నది. అయితే ఆ నిందితుడు ఎవరు అన్నది ఇంకా గుర్తించలేదు. కాగా, ఈ కేసు నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.