మణిపూర్ ఘటన- నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు

శుక్రవారం, 21 జులై 2023 (12:32 IST)
మణిపూర్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. మే 4వ తేదీన ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు. 
 
మరోవైపు ఈ కేసులో ఓ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు