మణిపూర్ ఘటన.. కన్నెర్ర చేసిన సుప్రీం కోర్టు.. మీరు చర్యలు తీసుకుంటారా?

గురువారం, 20 జులై 2023 (12:16 IST)
మణిపూర్ అల్లర్ల సమయంలో మహిళలను నగ్న ఊరేగింపుగా తీసుకెళ్తున్న వీడియోను చూసి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టుకు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, మణిపూర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇది రాజ్యాంగ వైఫల్యమని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోనట్లయితే, జూలై 28న కోర్టు ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. 
 
ఇక నిందితులను చట్టం ముందు నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ దశలో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు