ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కటకటాల్లోకి ప్రిన్సిపాల్

శనివారం, 15 అక్టోబరు 2016 (09:01 IST)
ప్రధాని నరేంద్ర మోడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మీరట్ పట్టణంలోని సర్దానా ప్రాంతంలో ముదస్సిర్ రాణా అనే వ్యక్తి ఓ ప్రైవేట్ పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. 
 
ఈయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, సంఘ్‌ ఇతర నేతలు, హోంమంత్రి రాజ్‌‌నాథ్‌ సింగ్‌, యోగా గురు రాందేవ్‌ బాబాలపై అసభ్యకరమైన రీతిలో పలు వ్యాఖ్యలు చేశాడు. 
 
ఈ విషయం సంఘ్ పరివార్ నేతల దృష్టికి వెళ్లింది. వారి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆయనపై అభియోగాలు నిజమని తేలడంతో ఐపీసీ సెక్షన్ 153, ఇతర ఐటీ చట్టాలపై కేసులు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి