అయోధ్యలో రామాలయం కాదు.. హైటెక్ రామ మ్యాజియం : కేంద్ర మంత్రి మహేశ్ శర్మ

మంగళవారం, 9 జూన్ 2015 (15:57 IST)
అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోనే రామమందిర నిర్మాణం చేపట్టాలని వీహెచ్‌పీ, ఆర్సెస్ వంటి సంఘ్ పరవార్ సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తుంటే.. కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మ మాత్రం అయోధ్యలో రామమందిరం కాకుండా, హైటెక్ రామ మ్యూజియాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. 
 
ప్రతిపాదిత 'రామాయణ సర్క్యూట్'లో భాగంగా అయోధ్యలో మ్యూజియం నిర్మిస్తామన్నారు. అయితే, అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో దీన్ని ఏర్పాటు చేయడంలేదని, ఇదో ప్రత్యేకమైన నిర్మాణం అని తెలిపారు. వచ్చే ఏడాది దీని పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయం తరహాలో ఈ మ్యూజియం ఉంటుందని మంత్రి తెలిపారు. అంటే రామ మందిరం నిర్మించాలన్న హిందుత్వవాదుల డిమాండ్లను కొంతకాలం పక్కనబెట్టాలన్నది మోడీ సర్కారు నిర్ణయంగా తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి