మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ చిత్రం గురించి తాజా అప్ డేట్ నేడు ప్రకటించారు. ఈ సినిమాకు చెందిన మొదటి సింగిల్ జింగుచా ఏప్రిల్ 18న విడుదల కాబోతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, ప్రేక్షకులను యాక్షన్, భావోద్వేగాలతో నిండిన ఉత్కంఠభరితమైన కథను తీసుకువస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్ మరియు పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారు.