కరోనా నేపథ్యంలో లాక్ డౌన్‌లో వుండి బోర్ కొట్టేసింది. దీంతో ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగానే వల వేశాడు. కానీ చేపలు చిక్కలేదు. నోట్ల కట్టలు చిక్కాయి. అంతే షాకైయ్యాడు. ఆ నోట్ల కట్లను ఇంటికి తెచ్చాడు. అన్నీ రూ. 500,రూ. 2000 నోట్లే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల వేటకు వెళ్లాడు. ఎప్పట్లానే వల వేశాడు.