హనీమూన్‌లో పీతల కూర తిన్న నవ దంపతులు ఊపిరాడక ఆస్పత్రిలో చేరగా, వధువు మృతి చెందింది. కరూర్ జిల్లాకు చెందిన దినేష్ కుమార్, కృప ఇటీవల వివాహం చేసుకుని కన్యాకుమారి సమీపంలో హనీమూన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ఉంటున్న హోటల్‌లో వడ్డించిన పీతల కూర తిన్నారు.
అయితే కొద్ది నిమిషాల తర్వాత ఇద్దరికీ ఊపిరాడక పోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందజేస్తుండగా వధువు మృతి చెందగా, భర్త దినేష్ కుమార్ ప్రాణాలతో పోరాడుతున్నట్లు తెలిసింది.