నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు వచ్చే నెల మూడో తేదీన ఉరిశిక్షలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డెత్ వారెంట్‌ను జారీచేసింది. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నిర్భయ నిందితులను ఉరి తీయాలని ఆ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది. ఈ నలుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడవసారి.
కాగా, న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ నలుగురు ముద్దాయిలు తమకు విధించిన ఉరిశిక్షలు అమలుకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా నలుగురు ముద్దాయిలు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయిస్తూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.