వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

ఠాగూర్

బుధవారం, 18 డిశెంబరు 2024 (08:51 IST)
తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడిని కార్యాలయంలో నిల్చోబెట్టిన ఉద్యోగులందరికీ సీఈవో తగిన శిక్ష విధించారు. వృద్ధుడుని 20 నిమిషాలు నిలబెట్టినందుకుగాను కార్యాలయంలో పని చేసే ఉద్యోగులందరూ నిల్చోవాలంటూ సీఈవో ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది.

ఈ ప్రాంతంలో ఉండే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో తమ వద్దకు వచ్చిన వృద్ధుడికి ​సహకరించకుండా 20 నిమిషాలు వేచి 16 మంది ఉద్యోగులు చేశారు. దీంతో ఆ 16 మంది ఉద్యోగులను సీఈవో డాక్టర్ లోకేష్.. సిబ్బందికి విచిత్రమైన శిక్ష విధించారు. ఉద్యోగులందరినీ 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలని ఆదేశం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్...

????ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో తమ వద్దకు వచ్చిన వృద్ధుడికి ​సహకరించకుండా 20 నిమిషాలు వేచి ఉండేలా చేసిన 16 మంది ఉద్యోగులు.… pic.twitter.com/LmE9gziysC

— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు