దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో అతిపెద్ద విషాదంగా పేర్కొంటున్నారు. ఈ విషాద ఘటన ఏళ్ల తరబడి మనల్ని వెంటాడుతుంది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల భవిష్యత్‌ను కాపాడటమే నేను చేయగలిగింది. సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీ సెంటరులో ఆ పిల్లకు ఉచిత విద్య అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
మరోవైపు, ఈ రైలు ప్రమాదంలో విచారణకు నిపుణులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటుచేసి, ఆ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.