తమ స్కూల్‌లో మానేసి మరో స్కూల్‌లో చేరిన మహిళా ఉపాధ్యాయురాలిని పాఠశాల కరస్పాండెంట్ లైంగికంగా వేధించాడు. ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలంటే ఒక్కసారి గదిలోకి వచ్చి కోర్కె తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఫిర్యాదు చేసింది. చెన్నై మహానగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ రెండు నెలల కిందటే తన ఉద్యోగాన్ని వదిలేసి మరో పాఠశాలలో చేరింది. అయితే, గురువారం ఆ టీచర్ తన ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం పాత పాఠశాలకు వచ్చి, కరస్పాండెంట్ రవిని సంప్రదించింది.
కామంతో కళ్లుమూసుకునిపోయిన రవి... నీకు ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలంటే గదికి వచ్చి తన కోర్కె తీర్చాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒప్పుకోకపోతే ఆమె గురించి చెడుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన టీచర్‌కు అసభ్య సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.