11 మంది ఎంపీలకు రాజ్యసభ వీడ్కోలు

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:25 IST)
ఈ సంవత్సరం నవంబర్‌లో 11 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం సభలో ప్రకటించారు.

‘‘ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఛత్రపాల్ సింగ్ యాదవ్, జావేద్ అలీఖాన్, పిఎల్ పునియా, రవిప్రకాష్ వర్మ, రాజారామ్, రామ్ గోపాల్ యాదవ్, వీర్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్, రాజ్ బబ్బర్ లు నవంబరులో పదవీ విరమణ చేయనున్నారు’’ అని వెంకయ్యనాయుడు రాజ్యసభలో వెల్లడించారు.

రాజ్యసభ సభ్యులుగా పదవీ విరమణ చేసినా దేశ ప్రజలకు సేవ చేయాలని వెంకయ్య కోరారు. పదవీ విరమణ చేయనున్న సభ్యులు ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని, వారు ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని సూచించారు. రాజ్యసభలో ప్రతి సభ్యుడు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. సభ్యుల్లో మూడింట ఒకవంతు ప్రతీ రెండవ సంవత్సరం పదవీ విరమణ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు